Fire accident: ఉత్తర ఢిల్లీలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం చెలరేగింది. శుక్రవారం ఉదయం ఆఫీస్ ఆరో అంతస్తులోని ఓ గదిలో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. అనంతరం కూలింగ్ ప్రాసెస్ నిర్వహించారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.