Fire accident : కేంద్రపాలిత ప్రాంతం లఢక్ (Ladakh) లోని ఓ ఆర్మీ క్యాంపు (Army Camp) లో అగ్ని ప్రమాదం (Fire accident) సంభవించింది. లేహ్ పట్టణం (Leh town) లోని డిగ్రీ కాలేజీ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని కీలలు ఎగిసిపడటంతో అప్రమత్తమైన ఆర్మీ జవాన్ (Army jawans) లు.. ఆర్మీలోని అగ్నిమాపక విభాగానికి సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారు.
ఫైరింజన్ల సాయంతో కొన్ని గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పేశారు. ఆర్మీ అధకారులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. ఆర్మీ క్యాంపులో అగ్ని కీలలు ఎగిసిపడుతున్న దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Leh, Ladakh: Fire breaks out at an Army Camp near Degree College in Leh. Fire was brought under control by the Indian Army jawans. No casualties or injuries reported. pic.twitter.com/MfCLqlCEX3
— ANI (@ANI) May 4, 2025