Fire accident : ఢిల్లీలోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బావనా పారిశ్రామిక వాడలోని బ్లాక్-సిలోగల సెక్టార్-3లోని ఓ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో స్థానికుల గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు.
మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతుడటంతో మొత్తం 16 ఫైరిజంన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ అగ్నిమాపక శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హనీ జరగలేదు. అయితే ప్రమాదానికిగల కారణాలు తెలియరాలేదు. అయితే ప్రమాదంలో పెద్దగా ఆస్తి నష్టం జరగకపోయినప్పటికీ భారీగా ఆస్తినష్టం సంభవించింది.
#WATCH | Delhi Fire Department received a call at 9:20 am from a factory in Sector-3, Bawana Industrial Area Block-C, Delhi. A total of 16 fire tenders rushed to the site. So far no causality reported.
(Source: Delhi Fire Department) pic.twitter.com/5KZ3288QBN
— ANI (@ANI) October 13, 2024