న్యూఢిల్లీ: దేశ రాజధానిలో 2019లో భారీ హోర్డింగులు ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీసులు శుక్రవారం కోర్టుకు తెలిపారు. అదనపు చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ నేహా మిట్టల్ ఎదుట దాఖలు చేసిన స్టేటస్ నివేదికలో ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని పేర్కొన్నారు.
ప్రివెన్షన్ ఆఫ్ డిఫేస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఉల్లంఘన జరిగినట్టు వచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మార్చి 11న ఢిల్లీ పోలీసులను జడ్జి ఆదేశించారు. కేసు విచారణను కోర్టు ఏప్రిల్ 18వ తేదీకి వాయిదా వేసింది.