రాయ్పూర్ : టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై ఛత్తీస్గఢ్లో కేసు నమోదైంది. రాయ్పూర్ నివాసి గోపాల్ సమంతో మన క్యాంప్ పోలీస్ స్టేషన్లో దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, పశ్చిమ బెంగాల్లోని నాదియా జిల్లాలో మహువ శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ, సరిహద్దు భద్రత బాధ్యత కేంద్రం పరిధిలోనిదని చెప్పారు.
చొరబాట్లపై అమిత్ షా తన బాధ్యతను నిర్లక్ష్యం చేసి, టీఎంసీ ప్రభుత్వాన్ని నిందించకూడదన్నారు. అమిత్ షా తలను నరికి, టేబుల్ మీద పెట్టాలన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామిక సంస్థలను కించపరిచే విధంగా ఉన్నాయని ఫిర్యాదుదారు ఆరోపించారు. మహువా మొయిత్రా సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.