ముంబై: పంటలు చేతికి అందక అప్పులపాలైన రైతు తన అవయవాలను అమ్మకానికి పెట్టాడు. కిడ్నీ రూ.75,000, కాలేయం రూ.90,000, కళ్లు రూ.25,000కు అమ్ముతానంటూ మేడలో వేసుకున్న ప్లకార్డును ప్రదర్శించాడు. (Buy the organs of farmers) ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దానిని నెరవేర్చలేదని ఆరోపించాడు. మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అదోలి గ్రామానికి చెందిన సతీశ్ ఐదోలు వ్యవసాయంలో నష్టపోయాడు. దీంతో బ్యాంకు రుణాలు తీర్చలేకపోయాడు. ఈ నేపథ్యంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంపై వినూతన్నంగా నిరసన తెలిపాడు. ‘రైతుల అవయవాలు కొనండి’ అని రాసి ఉన్న ఫ్లకార్డును మెడలో ధరించాడు. తన కిడ్నీలను రూ. 75,000కు, కాలేయాన్ని రూ. 90,000కు, కళ్లు రూ. 25,000కు అమ్ముతానని అందులో పేర్కొన్నాడు.
కాగా, రైతు రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల ముందు దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇచ్చారని, ఇప్పుడు రైతులే ఆ అప్పులు చెల్లించాలని చెబుతున్నారని రైతు సతీశ్ విమర్శించాడు. తమ వద్ద డబ్బు లేనప్పుడు ఎలా చెల్లించగలం అని నిలదీశాడు. నా అవయవాలు అమ్ముకోవడం తప్ప మరో మార్గం లేదని వాపోయాడు. తన శరీర భాగాలు అమ్ముకున్నప్పటికీ తన అప్పు తీరదని సతీశ్ తెలిపాడు. అందుకే తన కుటుంబ సభ్యుల అవయవాలు కూడా అమ్మకానికి పెట్టినట్లు చెప్పాడు. భార్య కిడ్నీని రూ. 40,000కు, కొడుకు కిడ్నీ రూ.20,000కు, చిన్న బిడ్డ కిడ్నీ రూ.10,000కు అమ్ముతానని అన్నాడు.
మరోవైపు రైతులకు రుణ మాఫీపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సతీశ్ కోరాడు. ఈ మేరకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఒక లేఖ రాశాడు. దీనిని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేశాడు. అయితే రైతు సతీశ్ వినూత్న నిరసన అక్కడున్న వారిని ఆకట్టుకున్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
महाराष्ट्र के वाशिम जिले के किसान का दिल दहला देने वाला वीडियो महाराष्ट्र के किसान आत्महत्या करने पर मजबूर बीजेपी देवेंद्र फडणवीस की सरकार महाराष्ट्र के किसानों से झूठे वादे करती है कर्ज माफी के आज किसान अपने शरीर के अंग बेचने को मजबूर है अपना कर्ज चुकता करने के लिए सरकार को शर्म… pic.twitter.com/HIxkJ5OUne
— Lakshmi S Nair (@LakshmiIndiaInc) April 1, 2025