న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. లోక్‌సభలో ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) పలు బిల్లులను ప్రవేశపెట్టారు. 2025 సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లును మంత్రి ప్రవేశపెట్టారు. 1944 నాటి సెంట్రల్ ఎక్సైజ్ బిల్లును సవరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. హెల్త్ సెక్యూర్టీ, నేషనల్ సెక్యూర్టీ సెస్ బిల్లును కూడా మంత్రి ప్రవేశపెట్టారు. జాతీయ భద్రత, ప్రజా ఆరోగ్యం కోసం నిధులను పెంచాలని కోరుతూ బిల్లును రూపొందించారు. మణిపూర్‌కు చెందిన జీఎస్టీ సవరణ బిల్లును కూడా మంత్రి నిర్మల సభలో ప్రవేశపెట్టారు.
FM @nsitharaman introduces The Health Security se National Security Cess Bill, 2025 in Lok Sabha.
The bill to augment the resources for meeting expenditure on national security and for public health, and to levy a cess for the said purposes on… pic.twitter.com/qTYQH4H70s
— SansadTV (@sansad_tv) December 1, 2025
మరో వైపు సిర్‌పై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. సభ జరుగుతున్న సమయంలో విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. కేంద్రం ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను నిలిపివేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓటర్ల జాబితా సవరణ కోసం కొన్ని రాష్ట్రాల్లో సిర్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.