బడ్జెట్ వేళ రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్..
FM Nirmala meets President Murmu: కేంద్ర మంత్రి నిర్మల ఇవాళ రాష్ట్రపతి ముర్మును కలిశారు. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంత్రి నిర్మల ఈ విషయాన్ని ముర్ముకు తెలియజేశారు. ఆ తర్వాత మంత్రి పార్లమెంట్‌కు చేరుకున్నారు.
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2023-24ను ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బహీఖాతా ట్యాబ్లెట్‌తో .. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కృష్ణారావ్ కరడ్, ఆర్ధిక శాఖ అధికారులు కూడా రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. ఎరుపు రంగు బహీఖాతాతో మంత్రి కనిపించారు.
Union Minister of Finance and Corporate Affairs Smt Nirmala Sitharaman, MoS Dr Bhagwat Kishanrao Karad, MoS Shri Pankaj Chaudhary and senior officials of the Ministry of Finance called on President Droupadi Murmu at Rashtrapati Bhavan before presenting the Union Budget 2023-24. pic.twitter.com/Nun9hhaVyi
— President of India (@rashtrapatibhvn) February 1, 2023
అయిదోసారి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి ట్యాబ్లెట్లో ఆమె బడ్జెట్‌ను చదువుతారు. ఇది పేపర్‌లెస్ బడ్జెట్ అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రపతి ముర్మును కలిసిన మంత్రి నిర్మల.. బడ్జెట్‌పై ఆమెకు సమాచారం అందజేశారు. బడ్జెట్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం కూడా దక్కనున్నది. ఉదయం 11 గంటలకు లోక్‌సభలో మంత్రి నిర్మల బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు.
బడ్జెట్ వేళ సాంప్రదాయ ఎరుపు రంగు చీరను మంత్రి నిర్మల ధరించారు. బ్లాక్ బార్డర్ ఉన్న ఆ చీరలో .. నక్షత్రం డిజైన్ కూడా ఉంది. రాష్ట్రపతి ముర్మును కలిసిన తర్వాత ఆమె పార్లమెంట్‌కు చేరుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

