Parliament | ఎన్నో చారిత్రాత్మక సంఘటనలకు సజీవ సాక్ష్యం.. భారత ప్రజాస్వామ్య యాత్రకు కేరాఫ్ పాత పార్లమెంట్ భవనం
పాత పార్లమెంట్ భవనం ప్రతి భారతీయుడి ఎమోషన్. 96 ఏండ్ల ఘన చరిత్ర దీని సొంతం. భారత ప్రజాస్వామ్య యాత్రకు కేరాఫ్. స్వయంపాలనలో ఎన్నో చారిత్రాత్మక సంఘటనలకు సజీవ సాక్ష్యం. ఎంతోమంది తమ గొంతుకను వినిపించేందుకు ఉపయోగపడిన గొప్ప వేదిక.
Parliament | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: పాత పార్లమెంట్ భవనం ప్రతి భారతీయుడి ఎమోషన్. 96 ఏండ్ల ఘన చరిత్ర దీని సొంతం. భారత ప్రజాస్వామ్య యాత్రకు కేరాఫ్. స్వయంపాలనలో ఎన్నో చారిత్రాత్మక సంఘటనలకు సజీవ సాక్ష్యం. ఎంతోమంది తమ గొంతుకను వినిపించేందుకు ఉపయోగపడిన గొప్ప వేదిక.
దాదాపు వందేండ్లుగా శాసనాలు రూపొందిస్తూ పాలనకు ఆలవాలంగా నిలుస్తున్న ఈ పార్లమెంట్ భవనం స్థానంలో కొత్త భవనం రూపుదిద్దుకొన్నది. కొత్త భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మే 28న ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. త్వరలో నూతన భవనంలోకి పార్లమెంట్ మారే నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి పాతభవనంపై పడింది.
పాత పార్లమెంట్ భవనం ప్రత్యేకతలు
- 1927 జనవరి 18న పార్లమెంట్ భవనాన్ని అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు.
- 1956లో మరో రెండు అంతస్థులను నిర్మించారు.
- 2006లో పార్లమెంట్ మ్యూజియంను ఏర్పాటు చేశారు. ఇందులో 2,500 నాటి భారతదేశ ప్రజాస్వామ్య వారసత్వం కనిపిస్తుంది.
- ఆరు ఎకరాల్లో నిర్మించిన ఈ భవనం ప్రపంచంలోనే విలక్షణమైనదిగా ప్రసిద్ధి పొందింది.
- స్వతంత్ర భారతదేశంలో తొలి సమావేశం 1946 డిసెంబర్ 9న ఇదే భవనంలోని సెంట్రల్ హాల్లో జరిగింది. 1949 నవంబర్ 26న భారత్ రాజ్యాంగాన్ని ఆమోదించింది.
- వలస పాలన, రెండో ప్రపంచ యుద్ధం, స్వాంతంత్య్ర ఉషస్సు, రాజ్యాంగ ఆమోదంలాంటి మైలురాళ్లకు ఇది సాక్షీభూతంగా నిలిచింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

