HomeNationalFastag To Cigarette Price Increases Several Changes Are Set To Take Place
ఫాస్టాగ్‌లకు కేవైవీ ఇక అక్కర్లేదు.. ఫిబ్రవరి 1 నుంచి వచ్చే మార్పులివే
ఫిబ్రవరి 1 నుంచి ప్రజల నిత్య జీవనంపై ప్రభావం పడే కొన్ని మార్పులు రానున్నాయి. ఫాస్టాగ్ నుంచి సిగరెట్ ధరల పెరుగుదల వరకు పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి.
పెరగనున్న సిగరెట్, పాన్ మసాలా ధరలు
న్యూఢిల్లీ : ఫిబ్రవరి 1 నుంచి ప్రజల నిత్య జీవనంపై ప్రభావం పడే కొన్ని మార్పులు రానున్నాయి. ఫాస్టాగ్ నుంచి సిగరెట్ ధరల పెరుగుదల వరకు పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి.
అవి ఏమిటంటే..
కొత్తగా జారీ చేసే ఫాస్టాగ్‌లకు నో యువర్ వెహికిల్ (కేవైవీ) తనిఖీ ప్రక్రియను పూర్తిగా తొలగిస్తున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ప్రకటించింది. వాహనం సమాచారాన్ని తనిఖీ చేయవలసిన పూర్తి బాధ్యత ఫాస్టాగ్‌ను జారీ చేసే బ్యాంకులదే.
పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తులు ఫిబ్రవరి 1 నుంచి మరింత ప్రియం కానున్నాయి. వీటిపై కేంద్రం అధిక సుంకాలు విధించడమే కారణం. పాన్ మసాలాపై అదనంగా ఆరోగ్యం, దేశ భద్రతకు సంబంధించిన పన్నులను కూడా విధిస్తున్నది.
ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పిస్తారు. ఆ రోజున స్టాక్ మార్కెట్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ యథావిధిగా ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పని చేస్తాయి. బడ్జెట్‌ను ఉదయం 11 గంటలకు ప్రవేశపెడతారు. కాబట్టి మార్కెట్ హెచ్చుతగ్గులకు గురయ్యే అవకాశం ఉంటుంది.
ఇంట్లో వాడుకునే వంట గ్యాస్, వాణిజ్య వంట గాస్ సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు సవరిస్తాయి.