ఫిబ్రవరి 1 నుంచి ప్రజల నిత్య జీవనంపై ప్రభావం పడే కొన్ని మార్పులు రానున్నాయి. ఫాస్టాగ్ నుంచి సిగరెట్ ధరల పెరుగుదల వరకు పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి.
దేశంలో సిగరెట్ ధరలను కేంద్రం భారీగా పెంచబోతున్నది. సిగరెట్ల అమ్మకాలను నిరోధించే లక్ష్యంతో ఇటీవల కేంద్రం చట్టసభలో ప్రవేశపెట్టిన కొత్త బిల్లు ప్రకారం సిగరెట్ల ధరలు భారీగా పెరుగుతాయి.