న్యూఢిల్లీ, డిసెంబర్ 28 : దేశంలో సిగరెట్ ధరలను కేంద్రం భారీగా పెంచబోతున్నది. సిగరెట్ల అమ్మకాలను నిరోధించే లక్ష్యంతో ఇటీవల కేంద్రం చట్టసభలో ప్రవేశపెట్టిన కొత్త బిల్లు ప్రకారం సిగరెట్ల ధరలు భారీగా పెరుగుతాయి. ప్రస్తుతం రూ.18 ఉన్న సిగరెట్ ధర కొత్త ఎక్సైజ్ పన్ను అనంతరం రూ.72కు చేరుతుందని అధికారులు తెలిపారు.
ఈ భారీ పెరుగుదల కారణంగా సిగరెట్ల అమ్మకాలు, వినియోగం బాగా తగ్గుతుందని కొందరు అంటుండగా, ఏకంగా ధరను నాలుగు రెట్లు పెంచుతారా? ఇదెక్కడి అన్యాయం? అంటూ ధూమపాన ప్రియులు ధుమధుమలాడుతున్నారు.