jammu Kashmir Assembly Polls : జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీతో ఎన్నికలకు ముందు లేదా ఎన్నికల అనంతరం పొత్తు ఉంటుందా అనే అంశంపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుపై తమకేమీ తెలియదని, ముందుగా ఎన్నికలకు సిద్ధమవడంపైనే తాము ప్రధానంగా దృష్టి సారించామని స్పష్టం చేశారు. పొత్తులపై ఏ ఒక్కరికీ తలుపులు మూసివేయలేదని తేల్చిచెప్పారు.
కాంగ్రెస్‌తో కూటమి ఏర్పాటుకు తమ కనీస ఉమ్మడి కార్యక్రమం ఎన్నికల్లో పోరాడటం, దేశంలో నియంతృత్వ పోకడలతో చెలరేగుతున్న విభజిత శక్తులను ఓడించడమేనని అన్నారు. కాగా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్‌లు సూత్రప్రాయంగా నిర్ణయించాయి.
ఈ దిశగా నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి ఏర్పాటుపై ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇరు పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు ఖరారు, భావసారూప్యత కలిగిన పార్టీలను కలుపుకుని వెళ్లడం వంటి అంశాలపైనా కసరత్తు సాగుతున్నదని సమాచారం. ఇక జమ్ము కశ్మీర్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొంది. జమ్ము కశ్మీర్ మాజీ మంత్రి, డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (DPAP) నేత తాజ్ మొహియుద్దీన్ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు.
Read More :