చండీగఢ్: కేంద్ర ప్రభుత్వంపై నిరసన తెలుపుతున్న రైతు సంఘాల నేతలు గురువారం పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో బీజేపీ దిష్టి బొమ్మలను దహనం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా ఈ నిరసనలకు నాయకత్వం వహించాయి. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కల్పించాలని, దీనికి చట్టబద్ధ హామీ ఇవ్వాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. రై తులు శంభు సరిహద్దు, అమృత్సర్, మో గా, కురుక్షేత్ర, అంబాలా, పంచకులల్లో బీజేపీ దిష్టి బొమ్మలను దహనం చేశారు.