చండీగఢ్, ఫిబ్రవరి 13: ఎమ్మెస్పీకి చట్టబద్ధత సహా.. రైతు సమస్యలపై చర్చించేందుకు రైతు సంఘాలు, కేంద్రం నేడు చండీగఢ్‌లో సమావేశం కాబోతున్నాయి.
28 మంది సభ్యులతో కూడిన రైతు ప్రతినిధి బృందం ఈ సమావేశాల్లో పాల్గొంటున్నదని, పలు అంశాలపై కేంద్రంతో చర్చిస్తుందని ఎస్కేఎం (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా గురువారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.