లక్నో, జూన్ 15: ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వ హయాంలో వందలాది రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. శనివారం ఆయన లక్నోలో మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల రైతులు, యువత తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రైతులు పండించిన పంటలకు సరైన ధర లభించడం లేదని, మరోవైపు పెట్టుబడి ఖర్చు పెరిగిపోయి వారు అప్పుల్లో కూరుకుపోతున్నారని ఆరోపించారు. ఎతావాహ్లో వడ్డీ వ్యాపారుల వేధింపుల వల్లనే యువ రైతు వికాస్ జాటవ్(30) ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు.