Onion Prices | భగ్గుమన్న ఉల్లి రైతు.. కిలో కేవలం రూపాయి..రోడ్డుపై పంటను పారబోసి మహా రైతుల నిరసన
ఉల్లి ధరలు ఘోరంగా పడిపోవడం పట్ల బీజేపీ పాలిత మహారాష్ట్రలో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం పండించిన పంటకు క్వింటాల్‌కు కేవలం 100 నుంచి 125 రూపాయల ధర పలకడంతో రైతులు సోమవారం సాయంత్రం గంగాపూర్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) బయట గంగాపూర్-నాసిక్ రోడ్‌పై తాము తెచ్చిన ఉల్లిగడ్డలను పారబోసి నిరసన వ్యక్తం చేశారు.
- రోడ్డుపై పంటను పారబోసి మహా రైతుల నిరసన
ఛత్రపతి శంభాజీనగర్, మే 26 : ఉల్లి ధరలు ఘోరంగా పడిపోవడం పట్ల బీజేపీ పాలిత మహారాష్ట్రలో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం పండించిన పంటకు క్వింటాల్‌కు కేవలం 100 నుంచి 125 రూపాయల ధర పలకడంతో రైతులు సోమవారం సాయంత్రం గంగాపూర్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) బయట గంగాపూర్-నాసిక్ రోడ్‌పై తాము తెచ్చిన ఉల్లిగడ్డలను పారబోసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. దీంతో ఆ రోడ్డుపై సుమారు గంట సేపటి వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఏపీఎంపీ అధికారులు, ఇతరులు ఘటనా స్థలికి చేరుకుని రైతులను శాంతింప చేశారు.
వాహెగాన్, రంజన్గావ్తో పాటు పరిసర ప్రాంతాల్లోని రైతులు మార్కెట్లో అమ్మేందుకు ఉల్లిగడ్డలను తీసుకువచ్చారు. అయితే కిలోకు రూపాయి నుంచి రూపాయిన్నర ధర మాత్రమే పలకడంతో వారు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉల్లిని పండించడానికి అయిన ఖర్చు కాదు కదా, కనీసం రవాణా చార్జి కూడా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వాతావరణంలో సంభవించిన మార్పులను వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుని ధరలను ఘోరంగా తగ్గించారని రైతులు ఆరోపించారు. ఈ ధరకు వాళ్లకు అమ్మడం కంటే రోడ్డుపై పారేయడమే ఉత్తమమని పలువురు రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, ఈ ఏడాది అధిక మొత్తంలో పంట దిగుబడి రావడంతో ఉల్లి రైతులు కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

