Delhi Blast | ఢిల్లీ పేలుడు (Delhi Blast) కేసులో తాజాగా మరో అరెస్ట్ చోటు చేసుకుంది. పేలుడు కేసులో ప్రధాన అనుమానితుడైన డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న డీఎల్10సీకే0458 అనే ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ (Ford Red EcoSport) కారును పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. హర్యానాలోని ఖండవలి (Khandwali) గ్రామంలో బుధవారం కనుగొన్నారు. అయితే, ఆ కారును అక్కడ పార్క్ చేసిన వ్యక్తిని ఫరీదాబాద్ పోలీసులు (Faridabad Police) తాజాగా అరెస్ట్ చేశారు. అతడిని ఫహీమ్‌గా గుర్తించారు. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా తెలిసింది.
Delhi terror blast case | Faridabad Police have detained the man who parked the red EcoSport in Khandwali, Faridabad. The man who parked the car is said to be Faheem, who is also a relative of the accused Dr Umar Un Nabi: Intelligence Agency Sources
— ANI (@ANI) November 13, 2025
మరోవైపు ఎర్రకోట వద్ద పేలుడుతో సంబంధం ఉన్న మూడో కారు కోసం దర్యాప్తు సంస్థలు వేట కొనసాగిస్తున్నాయి. సోమవారం సాయంత్రం తెలుపు రంగు హుందయ్ ఐ20 కారుతో డాక్టర్ ఉమర్ నబీ ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఉగ్రకుట్ర కోసం మూడు కార్లు వాడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారును ఫరీదాబాద్‌లో గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మూడో కారు మారుతీ బ్రీజా కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.
ఆ కారు ఆచూకీ చిక్కడం లేదు. నిందితులు ఆ మూడో కారును తప్పించుకోవడం కోసం వాడాలని భావించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు సంస్థలకు చెందిన బృందాలు ఆ కారు కోసం వేట కొనసాగిస్తున్నాయి. మారుతీ బ్రీజా కారును గుర్తించేందుకు ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంతో పాటు సమీప రాష్ట్రాల్లోనూ పోలీసులు వెతుకుతున్నారు.
#WATCH | Faridabad, Haryana | Visuals from the Khandawali village, where police seized the red EcoSport DL 10 CK 0458, suspected to be linked to the prime suspect, Dr Umar Un Nabi, in the Delhi blast case. pic.twitter.com/Kmp42S9iLj
— ANI (@ANI) November 13, 2025
Also Read..
Delhi Blast | ఢిల్లీలో మరోసారి పేలుడు శబ్దం.. భయంతో వణికిపోయిన స్థానికులు.. చివరికి
Delhi Blast | ఢిల్లీ పేలుడు.. పెరిగిన మృతుల సంఖ్య
Delhi Blast | బ్లాస్ట్‌కు ముందు మసీదును సందర్శించిన ఉమర్.. సీసీటీవీ దృష్యాలు వైరల్