న్యూఢిల్లీ: అమెరికాలోని ఓ భారత సంతతి వ్యక్తి జరిపిన కాల్పుల్లో అతడి భార్య, ముగ్గురు బంధువులు చనిపోయారు. కాల్పులకు భయపడి సకాలంలో దాక్కొన్న పిల్లలు ప్రాణాలను రక్షించుకున్నారు. అందులో ఓ చిన్నారి సమయస్ఫూర్తితో పోలీసులకు ఫోన్ చేయడంతో నిందితుడిని వారు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జార్జియాలో విజయ్ కుమార్ (51), ఆయన భార్య మీను డోగ్రా (43) నివసిస్తున్నారు. అట్లాంటా సబర్బ్స్లోని లారెన్స్ విల్లే సిటీలో వీరి ఇంట్లో శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో విజయ్ తుపాకీతో భార్య, బంధువులపై కాల్పులు జరిపాడు. దీంతో మీను డోగ్రా, గౌరవ్ కుమార్ (33), నిధి చందర్ (37), హరీశ్ చందర్ (38) మరణించారు.