ఆదివారం 29 మార్చి 2020
National - Mar 13, 2020 , 15:39:14

నకిలీ శానిటైజర్‌ కంపెనీ సీజ్‌

నకిలీ శానిటైజర్‌ కంపెనీ సీజ్‌

ముంబయి : చైనాలో ప్రబలిన కరోనా వైరస్‌.. ప్రపంచ దేశాలకు పాకింది. శానిటైజర్‌తో కరోనాను అరికట్టే అవకాశం ఉందని వార్తలు వెలువడిన నేపథ్యంలో దానికి మార్కెట్లో డిమాండ్‌ బాగా పెరిగింది. అన్ని మెడికల్‌ షాపుల్లోనూ శానిటైజర్‌ నోస్టాక్‌ బోర్డులు వెలిశాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న కొన్ని కంపెనీలు నకిలీ శానిటైజర్‌ను తయారు చేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే ముంబయిలోని వకోలా ఏరియాలో నకిలీ శానిటైజర్‌ను తయారు చేస్తున్న కంపెనీపై ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు దాడులు చేశారు. నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని కంపెనీని సీజ్‌ చేశారు. నకిలీ శానిటైజర్‌ తయారు చేస్తున్న కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎఫ్‌డీఏ అధికారులు స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ కేసుల సంఖ్య భారత్‌లో 73కి చేరింది. 


logo