Fake Currency | న్యూఢిల్లీ, నవంబర్ 27: దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న నకిలీ కరెన్సీ పట్ల కేంద్ర ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. మహాత్ముని చిత్రంతో ఉన్న కొత్త సీరిస్ 500 రూపాయల నకిలీ నోట్లు 2018-19 నుంచి 2023-24 కాలంలో నాలుగు రెట్లు పెరిగాయి. అలాగే 2020-21 నుంచి 2,000 రూపాయల నకిలీ నోట్లు కూడా మూడు రెట్లు పెరిగినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించారు. దేశంలో నకిలీ నోట్లపై లోక్సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.