న్యూఢిల్లీ: పుణెలో పని ఒత్తిడికి 26 ఏండ్ల ఉద్యోగిని మరణించడంతో కార్పొరేట్ కంపెనీలలో విష పని సంస్కృతి గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్న క్రమంలో అలాంటి ఘటనే థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఉన్నప్పటికీ సిక్ లీవ్ ఇవ్వడానికి మేనేజర్ నిరాకరించడంతో కార్మికురాలొకరు విధి నిర్వహణలో కుప్పకూలి మరణించిన ఘటన థాయ్‌లాండ్‌లో జరిగింది.
30 ఏండ్ల మే అనే కార్మికురాలు థాయ్‌లాండ్‌లోని డెల్టా ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పనిచేస్తున్నది. పెద్దపేగుకు సంబంధించిన వ్యాధితో ఆమె సెప్టెంబర్ 5 నుంచి 9 వరకు సిక్ లీవ్ తీసుకుంది. పరిస్థితి మెరుగుకాకపోవడంతో మరి కొన్ని రోజుల సిక్ లీవ్ కోసం మేనేజర్‌కు విజ్ఞప్తి చేసింది. దానికి అతడు నిరాకరించడంతో ఆమె అలాగే అనారోగ్యంతో విధులకు హాజరైంది.