Explosives : కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో ఇవాళ బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొన్నారు. ప్రధాని సమావేశానికి హాజరుకావడానికి ముందు వేదికకు మూడు కిలోమీటర్ల దూరంలోని కగలిపుర (Kagalipura) లో రెండు జిలెటిన్ స్టిక్స్ లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. బాంబు నిర్వీర్వ దళాలు వాటిని అక్కడి నుంచి తరలించినట్లు తెలిపారు.
కాగా ఆ జిలెటిన్ స్టిక్స్‌ను అక్కడ పెట్టినట్లు భావిస్తున్న ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. దాంతో అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో విస్తృత సోదాలు నిర్వహించారు. ప్రధాని మోదీ వేదిక వద్దకు చేరుకోవడానికి ముందు ఆయన కాన్వాయ్ వచ్చే మార్గంలో నిర్వహించిన సాధారణ భద్రతా తనిఖీల్లో ఈ జిలెటిన్ స్టిక్స్‌ను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.