28న నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత.. పేలుడు పదార్థాలు తరలింపు
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ నోయిడాలోని 40 అంతస్తుల ట్విన్ టవర్స్‌ను ఈ నెల 28న కూల్చివేయనున్నారు. ఈ మేరకు కూల్చివేతకు అవసరమైన 325 కిలోల పేలుడు పదార్థాలను శనివారం నోయిడాకు తరలించారు. నోయిడా అథారిటీ పర్యవేక్షణలో కూల్చివేత జరుగనున్నట్లు తెలుస్తున్నది. రెండు టవర్లను కూల్చివేసేందుకు 3700 కిలోల పేలుడు పదార్థాలు అవసరం కాగా.. ప్రతి రోజూ 325 కిలోల పేలుడు పదార్థాలను అందుబాటులో ఉంచనున్నారు.
ఇందులో భాగంగా ఇవాళ 325 కిలోల పేలుడు పదార్థాలను వ్యాన్లలో భవనం వద్దకు తీసుకువచ్చారు. పేలుడు పదార్థాలతో టవర్లను కూల్చివేసేందుకు నోయిడా అథారిటీకి సుప్రీం కోర్టు ఇటీవల అనుమతి ఇచ్చింది. ‘కట్టుదిట్టబమైన భద్రత మధ్య నోయిడాలోని సూపర్ టెక్ ట్విన్ టవర్స్‌కు పాల్వాల్నుంచి పేలుడు పదార్థాలను తీసుకువచ్చారు. ఈ నెల 28న భవనాన్ని కూల్చివేయనున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశించింది.
నోయిడా అథారిటీ నేతృత్వంలో పూర్తి కూల్చివేత పనులు జరుగుతున్నాయి’ అని ఓ పోలీస్ అధికారి పేర్కొన్నారు. కూల్చివేసేందుకు భవనంలో 9,400 రంధ్రాలను వేయగా.. వీటిని పేలుడు పదార్థాలతో నింపనున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక 28న రెండు టవర్లను కూల్చివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ పరిధిలోని నోయిడా సెక్టార్ 93 ప్రాంతంలో సూపర్ టెక్ లిమిలెడ్కంపెనీ 2009లో భారీ ప్రాజెక్టు చేపట్టింది.
ఈ భవనాల విషయంలో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రణాళికను చూపాలన్న నిబంధనను బిల్డర్ పట్టించుకోకపోవడం, అధికారులతో కుమ్మక్కై నిబంధనలు పాటించకపోవడంతో స్థానికంగా ఉన్న నలుగురు ఓ లీగల్ కమిటీగా ఏర్పడి సూపర్ టెక్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీం కోర్టు 40 అంతస్తుల జంట భవనాలను కూల్చివేయాలని గతేడాది ఆగస్టులో ఆదేశాలు ఇచ్చింది. ఇదే సమయంలో టవర్స్‌లో ప్లాట్లు కొన్న వారందరికీ 12శాతం వడ్డీతో డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

