న్యూఢిల్లీ : ఢిల్లీలో మంగళవారం జరిగిన చర్చల్లో భారత్-చైనా దౌత్య సంబంధాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సరిహద్దు పునర్విభజన కోసం ముందస్తు పరిష్కారాలను అన్వేషించే పనిలో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయి.
24వ రౌండ్ ప్రత్యేక ప్రతినిధులు చర్చల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.