సొనాలి పోగట్ ఫాంహౌస్‌లో ఖరీదైన కార్లు, ఫర్నిచర్ మాయం
నటి, బీజేపీ నేత సొనాలి పోగట్ అనుమానాస్పద మృతిపై పలు ఊహాగానాలు సాగుతుండగా తాజాగా ఆమె ఫాంహౌస్ నుంచి ఖరీదైన కార్లు, ఫర్నిచర్ అదృశ్యమైనట్టు తెలిసింది.
న్యూఢిల్లీ : నటి, బీజేపీ నేత సొనాలి పోగట్ అనుమానాస్పద మృతిపై పలు ఊహాగానాలు సాగుతుండగా తాజాగా ఆమె ఫాంహౌస్ నుంచి ఖరీదైన కార్లు, ఫర్నిచర్ అదృశ్యమైనట్టు తెలిసింది. సొనాలి పోగట్ ఆస్తిని చేజిక్కించుకోవాలని ఆమె హత్య కేసులో నిందితుడు సుధీర్ సంగ్వాన్ ఎప్పటినుంచో ప్రణాళికలు రచిస్తున్నాడని హత్య కేసును దర్యాప్తు చేసిన గోవా పోలీసులు వెల్లడించిన తర్వాత ఫాంహౌస్‌లో విలువైన ఆస్తులు మాయం కావడం గమనార్హం.
సోనాలి ఆస్తులపై కన్నేసిన సంగ్వాన్ 20 ఏండ్ల లీజుపై ఆమె ఫాంహౌస్‌ను దక్కించుకోవాలని కుట్ర పన్నాడని గోవా పోలీసులు వెల్లడంచారు. మహీంద్ర స్కార్పియో సహా పలు వాహనాలు ఫాంహౌస్ నుంచి అదృశ్యమయ్యాయని సమాచారం. సొనాలి ఫోగట్ ఫాంహౌస్ విలువ రూ 110 కోట్లు ఉంటుందని అంచనా. ఏటా రూ 60,000 చెల్లించి 20 ఏండ్ల పాటు సొనాలి ఫాంహౌస్‌ను లీజుకు తీసుకోవాలని సొనాలి పీఏ సంగ్వాన్ స్కెచ్ వేశాడని తెలిసింది.
సొనాలీ పోగట్ మృతి కేసులో సంగ్వాన్‌ను గోవా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సొనాలి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు హిస్సార్‌లో ఆమె డైరీ లభించింది. డైరీలో పలువురు రాజకీయ నేతలు, కార్యకర్తల నెంబర్లు ఉన్నాయని గుర్తించారు. డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు సొనాలి పోగట్ లాకర్‌ను కూడా సీజ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

