న్యూఢిల్లీ : తన గుర్తింపు నిరూపించుకోవాలంటూ నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ అరుణ్ ప్రకాశ్‌కు ఈసీ నుంచి నోటీసులు అందాయి. దీనిపై ఆయన ‘ఎక్స్’లో స్పందిస్తూ, ‘సర్’ ఫారాలు అవసరమైన సమాచారాన్ని రాబట్టలేకపోతే వాటిని సవరించాలని అన్నారు. ‘బూత్ స్థాయి అధికారి తన ఇంటికి మూడుమార్లు వచ్చారు. అప్పుడే.. అదనపు సమాచారాన్ని అడిగి ఉండచ్చు.
కానీ అలా చేయలేదు. 82, 78 ఏండ్లు ఉన్న నాకు, నా భార్యకు నోటీస్ ఇచ్చారు. 18 కి.మీ. దూరంలో ఉన్న రెండు వేర్వేరు చోట్లకు.. వేర్వేరు తేదీల్లో హాజరుకావాలని తెలిపారు’ అని ‘ఎక్స్’లో వివరించారు. గోవాలో ప్రస్తుతం కొనసాగుతున్న ‘సర్’ ప్రక్రియలో భాగంగా ఆయనకు నోటీసులు అందాయి. 40 ఏండ్లు భారత సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయనకు ఎదురైన ఈ అనుభవం వైరల్ అయ్యింది.