Priyanka Chaturvedi | కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఫ్లయింగ్ కిస్ (Flying Kiss) వ్యవహారం పార్లమెంట్ (Parliament) లో దుమారం రేపింది. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై మాట్లాడిన అనంతరం వెళ్తూ వెళ్తూ బీజేపీ మహిళా ఎంపీల బెంచ్‌ల వైపు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani ) ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో సభలోని మహిళా ఎంపీలు రాహుల్ పై ఆగ్రహానికి గురయ్యారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ మహిళా ఎంపీలు డిమాండ్ చేశారు. కాగా, తాజాగా ఈ ఘటనపై ఉద్ధవ్ ఠాక్రేకి చెందిన శివసేన (యూబీటీ) పార్టీ ఎంపీ ప్రియాంక చతుర్వేది (Priyanka Chaturvedi ) స్పందించారు. ఈ అంశంలో రాహుల్ కు మద్దతుగా నిలిచారు. రాహుల్ ఫ్లయింగ్ కిస్‌లో తప్పేమీ లేదని.. ఆయన ఆప్యాయంగా ‘సంజ్ఞ’ చేశారన్నారు.
‘సభలో రాహుల్ మాట్లాడుతున్నప్పుడు మంత్రులందరూ లేచి నిలబడి ఉన్నారు. రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే.. ఆయన ఆప్యాయంగా మాట్లాడారు, ప్రేమపూర్వకంగా వ్యవహరించారు. దాంతో మీకేమి ఇబ్బంది..? అర్థం చేసుకోలేని ధ్వేషం మీకు అలవాటైపోయింది. ప్రేమ, ఆప్యాయతకు చెందిన ఏ సంజ్ఞ అయినా మీకు వేరేలా కనిపిస్తుంది’ అని ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు.
బుధవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై మాట్లాడిన అనంతరం రాహుల్.. వెళ్తూ వెళ్తూ బీజేపీ మహిళా ఎంపీల బెంచ్‌ల వైపు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. దీనిపై ఇరానీతోపాటు 20 మంది బీజేపీ మహిళా ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. రాహుల్ అనుచితంగా ప్రవర్తించారని, చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. మణిపూర్ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు బీజేపీ నాటకాలు ఆడుతోందని విమర్శించింది. ఫ్లయింగ్ కిస్‌పై బీజేపీ పోస్టు చేసిన 14 సెకండ్ల నిడివి గల వీడియోలో రాహుల్ ముఖం స్పీకర్ వైపు ఉన్నదని, ఆ వైపునే ఆయన సైగలు ఉన్నాయని మహిళా కాంగ్రెస్ నేత నెట్టా డిసౌజా పేర్కొన్నారు. స్మృతి ఇరానీ, ఇతర మహిళా బీజేపీ ఎంపీలు రాహుల్‌పై ఎదురుగా కాకుండా, పక్క వైపుగా ఉన్నారని అన్నారు. తప్పుడు ప్రచారాలు చేసే బీజేపీ.. సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నదని దుయ్యబట్టారు.
Also Read..
Crime news | మహిళను రూ.70వేలకు కొనుగోలు చేసి పెళ్లి చేసుకున్నాడు.. ఆమె ప్రవర్తన నచ్చక చంపేశాడు
New Covid Variant | అమెరికాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ కలకలం