New Covid Variant | అమెరికాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ కలకలం
New Covid Variant | అగ్రరాజ్యం అమెరికా (America)లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇటీవలే పుట్టుకొచ్చిన ఈజీ. 5 (EG.5) వేరియంట్ ప్రస్తుతం దేశంలో 17 శాతం కొత్త కరోనా వైరస్ కేసులకు కారణమవుతోందని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది.
New Covid Variant | గత మూడేళ్లుగా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ (Corona Virus) మహమ్మారి ప్రస్తుతం అదుపులోనే ఉంది. భారత్ లో రోజూవారి కొత్త కేసుల్లో పెరుగుదల లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. దీంతో ప్రజలు సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో కరోనా కొత్త వేరియంట్లు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి.
అగ్రరాజ్యం అమెరికా (America)లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇటీవలే పుట్టుకొచ్చిన ఈజీ. 5 (EG.5) వేరియంట్ ప్రస్తుతం దేశంలో 17 శాతం కొత్త కరోనా వైరస్ కేసులకు కారణమవుతోందని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది. ఈ కొత్త రకం వేరియంట్ ఒమిక్రాన్ జాతికి చెందిన ఎక్స్‌బీబీ 1.9.2 (XBB.1.9.2) రికాంబినెంట్ వైరస్ నుంచి పుట్టుకొచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎక్స్‌బీబీ 1.9.2 స్ట్రెయిన్‌తో పోలిస్తే ఈజీ.5లోని స్పైక్ ప్రోటీన్‌లో ఒక జన్యుమార్పు (మ్యూటేషన్) అదనంగా ఉందని గుర్తించినట్లు చెప్పారు. ఈ కొత్త మ్యూటేషన్ గతంలో ఇతర కరోనా వేరియంట్లలో కూడా గుర్తించామని వారు వెల్లడించారు.
ఈజీ.5 కాకుండా ఎరిస్ (Eric) లేదా ఈజీ.5.1 (EG.5.1) అని పిలవబడే మరో కొత్త వేరియంట్ కూడా ప్రస్తుతం వేగంగా వ్యాపిస్తోంది. కొవిడ్-19 (Covid-19)లో ఒమిక్రాన్ రకం నుంచి వచ్చిన ఈజీ.5.1 (EG.5.1) ప్రస్తుతం బ్రిటన్ (UK)ని వణికిస్తోంది. ఈ కొత్త వేరియంట్ ప్రస్తుతం ఆ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో దీని వాటా 14.6 శాతంగా ఉందన్నారు. బ్రిటన్ ను భయపెట్టిస్తున్న కొత్త వేరియంట్ భారత్ లో కూడా విజృంభిస్తోంది. యూకేలో విస్తృతంగా వ్యాపిస్తున్న ఎరిస్ అని పిలిచే ఈ వేరియంట్ కేసులు మహారాష్ట్రలో కూడా గణనీయంగా పెరుగుతున్నాయి.
ఇవీ లక్షణాలు :
ఒమిక్రాన్ వేరియంట్ కొన్ని జన్యు మార్పులు సంతరించుకోవడం ద్వారా ఈ న్యూ వేరియంట్ ఉత్పన్నమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో కనిపించిన వ్యాధి లక్షణాలే.. ఇంచుమించుగా ఈ కొత్త వేరియంట్ సంక్రమించిన వారిలో కూడా కనిపిస్తున్నాయని తెలిపారు. సాధారణంగా ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో ముక్కు కారడం, తీవ్రమైన తల నొప్పి, గొంతు నొప్పి, తుమ్ములు, ఆయాసం లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని, కొత్త వేరియంట్ ఎరిస్ సోకిన వారిలో ఈ లక్షణాలే కామన్‌గా ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు.
Also Read..
Mega Millions jackpot | లక్ అంటే ఇది.. లాటరీలో ఏకంగా రూ.13వేల కోట్ల జాక్‌పాట్..!
No-Confidence Motion | అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో నేడు సమాధానం ఇవ్వనున్న మోదీ
Graduation | తమ అమ్మాయి కనీసం డిగ్రీ చదవాలని కోరుకుంటున్న 78 మంది తల్లిదండ్రులు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

