Mega Millions jackpot | లక్ అంటే ఇది.. లాటరీలో ఏకంగా రూ.13వేల కోట్ల జాక్‌పాట్..!
Mega Millions jackpot | లాటరీ ద్వారా వేలు, లక్షల రూపాయలు గెలుచుకోవడం చూస్తుంటాం. మహా అయితే రూ.కోటి గెలుచుకుంటుంటారు. అయితే, అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం లాటరీ ద్వారా ఏకంగా రూ.వేల కోట్లు గెలుచుకుని వార్తల్లోకెక్కాడు.
Mega Millions jackpot | లాటరీ ద్వారా వేలు, లక్షల రూపాయలు గెలుచుకోవడం చూస్తుంటాం. మహా అయితే రూ.కోటి గెలుచుకుంటుంటారు. అయితే, అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం లాటరీ ద్వారా ఏకంగా రూ.వేల కోట్లు గెలుచుకుని వార్తల్లోకెక్కాడు. అతను గెలుచుకుంది.. వెయ్యి కోట్లో.. లేక, రెండు వేల కోట్లో కాదండోయ్. ఏకంగా రూ. 13 వేల కోట్లు. ఆశ్చర్యంగా ఉంది కదూ..! మీరు విన్నది నిజమే. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
అమెరికా (America)లోని ఫ్లోరిడా ( Florida)లో గల నెప్యూన్ బీచ్ లోని పబ్లిక్స్ స్టోర్ విక్రేత మెగా మిలియన్స్ లాటరీ (Mega Millions lottery)లో టికెట్‌ను విక్రయించాడు. లాటరీ నిర్వాహకులు మంగళవారం డ్రా తీయగా.. 13, 19, 20, 32, 33, 14 నంబర్ టికెట్‌కు జాక్‌పాట్ దక్కినట్లు ప్రకటించారు. ఈ లాటరీ ద్వారా అతను 1.58 బిలియన్ డాలర్ల నగదును గెలుచుకున్నాడు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.13వేల కోట్లు అన్నమాట. అయితే, విజేత వివరాలను మాత్రం వారు వెల్లడించలేదు.
లాటరీలో గెలుచుకున్న మొత్తాన్ని నిర్వాహకులు 30 ఏళ్ల పాటు వాయిదాల పద్ధతిలో చెల్లిస్తారు. విజేతకు మొత్తం ఒకేసారి కావాలన్నా ఇస్తారు. అయితే, 783 మిలియన్ డాలర్లు (రూ.6,488 కోట్లు) మాత్రమే చెల్లిస్తారు. చాలా మంది లాటరీ విజేతలు తాము గెలుచుకున్న సొమ్మును విడతల వారీగా కాకుండా ఒకేసారి తీసుకుంటుంటారు.
కాగా, అమెరికా చరిత్రలో మూడో అతిపెద్ద లాటరీ ప్రైజ్‌మనీ ఇదే అని అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. 2018లో సౌత్ కరోలినాకు చెందిన వ్యక్తికి లాటరీలో రూ.12,436 కోట్లు వరించాయి. ఈ ఏడాది మొదట్లో అమెరికాలోని మైనేకి ప్రాంతానికి చెందిన ఓ సాధారణ వ్యక్తి ‘మెగా మిలియన్స్’ జాక్‌పాట్ డ్రాలో రూ. 10,973 కోట్లు గెలుచుకున్నాడు.
Also Read..
No-Confidence Motion | అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో నేడు సమాధానం ఇవ్వనున్న మోదీ
Gas cylinder price | అసలే సిలిండర్ ధర రూ.1100 దాటిందంటే.. దానికితోడు సర్వీస్ చార్జీల బాదుడు
Japanese Couple | రజనీ ‘జైలర్’ చూడటానికి ఒసాకా నుంచి చెన్నై వచ్చిన జపనీస్ దంపతులు..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

