లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని సరోజినీ నగర్లో ఉన్న బ్రహ్మోస్ ఏరో స్పేస్ యూనిట్లో తయారైన బ్రహ్మోస్ క్షిపణుల తొలి బ్యాచ్‌ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. భారత దేశ బలం పెరుగుతుండటానికి నిదర్శనం బ్రహ్మోస్ క్షిపణి అని రాజ్‌నాథ్ తెలిపారు.
పాకిస్థాన్ భూభాగంలోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణుల పరిధిలోనే ఉందని ఆయన హెచ్చరించారు. ‘ఆపరేషన్ సిందూర్’ ట్రైలర్ మాత్రమేననని, దేశానికి గెలవడం ఓ అలవాటుగా మారిందని ఆపరేషన్ రుజువు చేసిందన్నారు.