Indians | రోజుకు 65 మంది భారతీయుల అరెస్ట్..అమెరికా బార్డర్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ నివేదికలో వెల్లడి
సంఖ్య తగ్గుతున్నప్పటికీ డంకీ మార్గం ద్వారా అమెరికాలోకి భారతీయుల అక్రమ ప్రవేశం కొనసాగుతూనే ఉంది. 2025వ సంవత్సరంలో ఈ మార్గం ద్వారా ప్రయాణించి అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించాలని ప్రయత్నించిన మొత్తం 23,830 మంది భారతీయులను (రోజుకు సరాసరి 65 మంది చొప్పున) అరెస్టు చేసినట్లు అమెరికా బార్డర్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ తన తాజా నివేదికలో వెల్లడించింది.
- అమెరికాకు కొనసాగుతున్న వలసలు
న్యూఢిల్లీ: సంఖ్య తగ్గుతున్నప్పటికీ డంకీ మార్గం ద్వారా అమెరికాలోకి భారతీయుల అక్రమ ప్రవేశం కొనసాగుతూనే ఉంది. 2025వ సంవత్సరంలో ఈ మార్గం ద్వారా ప్రయాణించి అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించాలని ప్రయత్నించిన మొత్తం 23,830 మంది భారతీయులను (రోజుకు సరాసరి 65 మంది చొప్పున) అరెస్టు చేసినట్లు అమెరికా బార్డర్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ తన తాజా నివేదికలో వెల్లడించింది.
గతంతో పోలిస్తే అక్రమ ప్రవేశాలు తగ్గినప్పటికీ అవి పూర్తిగా ఆగిపోలేదని అధికారులు తెలిపారు. 2024లో జో బైడెన్ హయాంలో 85,119 మంది భారతీయులను నిర్బంధించినట్లు వారు చెప్పారు. అక్రమ వలసదారుల వైఖరిలో కూడా మార్పు వచ్చిందని అధికారులు అభిప్రాయపడ్డారు. 2025లో అరెస్టయిన భారతీయులలో ఒక్కరి వెంట కూడా కుటుంబం లేదని, అందరూ ఒంటరిగానే ప్రయాణిస్తున్నారని అధికారులు వివరించారు. 2024తో పోలిస్తే ఇది పెనుమార్పుగా వారు అభివర్ణించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

