అధిక పింఛన్‌కు మోక్షమెప్పుడో?!
అర్హులైన వారికి అధిక పింఛన్ చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించి 17 నెలలు గడుస్తున్నప్పటికీ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌లో చలనం లేదు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ఉద్యోగ, కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.
- నత్తనడకన 17 లక్షల దరఖాస్తుల పరిశీలన
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): అర్హులైన వారికి అధిక పింఛన్ చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించి 17 నెలలు గడుస్తున్నప్పటికీ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌లో చలనం లేదు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ఉద్యోగ, కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అధిక పెన్షన్ కోసం ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఏండ్ల తరబడి చేస్తున్న న్యాయ పోరాటం ఫలితంగా ఎట్టకేలకు 2022 నవంబర్‌లో సుప్రీంకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది.
ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చే అర్హులైన కార్మికులు, ఉద్యోగులకు అధిక పింఛను చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు అధిక పింఛన్‌కు అర్హులైన వారి నుంచి ఈపీఎఫ్‌వో దరఖాస్తులు స్వీకరించింది. దేశవ్యాప్తంగా 17.48 లక్షల మంది దరఖాస్తు చేసుకొన్నారు. అయితే వాటిని పరిశీలించి అధిక పింఛన్ చెల్లించడానికి చర్యలు చేపట్టాల్సిన ఈపీఎఫ్‌వో.. మార్గదర్శకాల పేరిట అనేక కొర్రీలు పెడుతున్నదని పింఛనుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారి ఒకరు స్పందిస్తూ… ఈపీఎఫ్‌లో సిబ్బంది కొరత వల్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నదని చెప్పారు. తమ సిబ్బంది లోక్‌సభ ఎన్నికల విధులను కూడా నిర్వహిస్తుండటంతో ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టొచ్చని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

