మంగళవారం 31 మార్చి 2020
National - Feb 15, 2020 , 00:45:04

గర్భిణి ప్రసూతి ఖర్చులు.. ఇకపై రూ.7,500 చెల్లింపు

గర్భిణి ప్రసూతి ఖర్చులు..  ఇకపై రూ.7,500 చెల్లింపు

న్యూఢిల్లీ: ప్రసూతి సేవల కోసం గర్భిణులకు ఇచ్చే ఖర్చుల మొత్తాన్ని రూ.7,500కు పెంచుతున్నట్టు ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పోరేషన్‌ (ఈఎస్‌ఐసీ) తెలిపింది. గురువారం నిర్వహించిన ఈఎస్‌ఐసీ సమావేశంలో కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోశ్‌ గంగ్వార్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఇప్పటివరకూ ఈ మొత్తం రూ.5,000గా ఉన్నది. పెరిగిన జీవన వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ పెంపు నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈఎస్‌ఐసీ దవాఖానలు, ఆరోగ్య కేంద్రాల్లో ప్రసూతి సేవలు అందుబాటులో లేని సందర్భంలో ఇతర దవాఖానల్లో ఆయా సేవల్ని వినియోగించుకునే గర్భిణీలకు ఈఎస్‌ఐసీ ఈ మొత్తాన్ని చెల్లిస్తున్నది. 


logo
>>>>>>