UN | న్యూఢిల్లీ : నియంతల యుగం మళ్లీ రావచ్చని ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల మండలి అధిపతి హెచ్చరించారు. అత్యంత ప్రమాదకర ఘటనలను నివారించడానికి అత్యవసర చర్యలు అవసరమని పిలుపునిచ్చారు. మానవ హక్కుల మండలిని ఉద్దేశించి దాని హై కమిషనర్ వోకర్ టర్క్ మాట్లాడుతూ గత శతాబ్దాల్లో కొందరు శక్తివంతులు యథేచ్ఛగా బల ప్రయోగానికి పాల్పడేవారని, ప్రజలపై విచక్షణారహితంగా దాడులు చేసేవారని చెప్పారు. నియంతల హింసలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందన్నారు.