Rammandir | అయోధ్యలో రామ మందిరం డిజైనింగ్‌తోపాటు నిర్మాణం చేసిందెవరో తెలుసా..?!
Rammandir | అయోధ్యలో అంగరంగ వైభవంగా సోమవారం రామ మందిర ప్రాణ ప్రతిష్ట జరుగనున్నది. ఈ ఆలయాన్ని ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ ఎల్ అండ్ టీ డిజైన్ చేసి నిర్మించింది.
Rammandir | యావత్ దేశమంతా సోమవారం అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కోసం సిద్ధమైంది. మరోవైపు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. యావత్ భారతీయులంతా గర్వించదగ్గ ఈ వేడుకలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ తదితర ప్రముఖులంతా ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అయోధ్య రామ మందిరం డిజైనింగ్‌తోపాటు నిర్మాణం చేపట్టిన ఘనత ప్రముఖ కార్పొరేట్ సంస్థకు దక్కుతుంది. అదే లార్సెన్ అండ్ టర్బో (ఎల్ అండ్‌టీ). ఆ సంగతి స్వయంగా ఎల్ అండ్ టీ ఆదివారం వెల్లడించింది.
శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ అనుమతితో అయోధ్యలో శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని డిజైన్ చేయడంతోపాటు విజయవంతంగా నిర్మించినట్లు ఎల్ అండ్ టీ తెలిపింది. శ్రీరామజన్మభూమి ఆలయన నిర్మాణంలో తమ వాస్తు వైభవం కొత్త మైలురాయిని నమోదు చేసిందని ఓ ప్రకటనలో పేర్కొంది.
70 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన దేవాలయం పురాతన నగర సంస్కృతిని ప్రతిబింబించేలా అర్కిటెక్చర్లు డిజైన్ చేశారు. వెయ్యేండ్లు మన్నికగా ఉండేలా 161.75 అడుగుల ఎత్తున, 380 అడుగుల పొడవు, 249.5 అడుగుల వెడల్పు విస్తీర్ణంలో నిర్మించారు. మూడంతస్తుల భవనంతో కూడిన ఈ దేవాలయంలో ఐదు మండపాలు ఉంటాయి. ప్రధాన శిఖరంతోపాటు నృత్య మండపం, రంగ్ మండపం, గుడ్ మండపం, కీర్తన మండపం, ప్రార్థనా మండపం ఉంటాయి.
`శ్రీ రామజన్మభూమి దేవాలయం డిజైనింగ్, నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించినందుకు ప్రభుత్వానికి మేం హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం` అని ఎల్ అండ్ టీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ తెలిపారు. 50 ఏశాలకు పైగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ ఎల్ అండ్ టీ. ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, నిర్మాణ ప్రాజెక్టులు, హైటెక్ మాన్యుఫాక్చరింగ్, సర్వీసుల రంగంలో అందె వేసిన సంస్థ ఇది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

