న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి ఉదయ్‌పూర్‌కు బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని అధికారులు తిరిగి ఢిల్లీకి మళ్లించారు. ఉదయ్‌పూర్ బయలుదేరిన ఇండిగో విమానం ఇంజిన్‌లో వైబ్రేషన్స్ కారణంగా.. తిరిగి ఢిల్లీకి మళ్లించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఘటనపై డీజీసీఏ దర్యాప్తును ప్రారంభించింది. విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఒకే రోజులో రెండోది. ఇవాళ స్పైస్‌జెట్ విమానంలో ‘ఆటో పైలట్’లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఢిల్లీ నుంచి నాసిక్‌కు బయలుదేరిన విమానాన్ని.. ఢిల్లీకి మళ్లించారు. ఈ ఘటనపై సైతం డీజీసీఏ విచారణ చేపట్టనున్నది.