బీజాపూర్: చత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్‌లో ఇవాళ ఎన్కౌంటర్(Encounter) జరిగింది. సెక్యూర్టీ సిబ్బంది, నక్సలైట్ల మధ్య శుక్రవారం ఉదయం ఎన్కౌంటర్ ప్రారంభమైంది. బైరాంఘర్-ఇంద్రావతి అడవి కొండల్లో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నక్సలైట్ ఆపరేషన్ కోసం జిల్లా రిజర్వ్ గార్డు బృందం బయటకు వెళ్లిన సమయంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో మావోలు తిరుగుతున్నట్లు సమాచారం రావడంతో సెక్యూర్టీ బలగాలు అక్కడకు వెళ్లాయి. ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు ఓ పోలీసు అధికారి చెప్పారు. ఎన్‌కౌంటర్‌కు చెందిన మరిన్ని విషయాలు వెల్లడి కావాల్సి ఉన్నది. సుక్మా జిల్లాలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గరు నక్సల్స్ హతమయ్యారు. ఆ ముగ్గురిపై 12 లక్షల రివార్డు ఉన్నది.