Alert system : భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) కి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ మాత్రం సాధారణ పౌరులు, ఇండియన్ ఆర్మీ (Indian Army) ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది.
దాంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలను హెచ్చరిస్తూ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అందులో భాగంగా యుద్ధానికి సంబంధించి నేరుగా ఫోన్లకే హెచ్చరిక సందేశాలూ వచ్చేలా ఏర్పాట్లు చేశారు. నెట్వర్క్ సమస్య ఉన్నా కూడా మెసేజ్‌లు వచ్చే వెసులుబాటు కల్పించారు. ప్రజలు తమ ఫోన్లకు వచ్చే సందేశాలను పాటిస్తూ సురక్షితమైన ప్రాంతాలకు చేరుకోవచ్చు.
సునామీలు, భూకంపాలు లాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, యుద్ధాలు, ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేందుకు భారత ప్రభుత్వం వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థ (Emergency Alert System) ను రూపొందించింది. ఆకస్మిక పరిస్థితుల్లో ప్రజలకు అలర్ట్ మెసేజ్ ద్వారా సమాచారం చేరవేయడమే లక్ష్యంగా దీన్ని రూపొందించింది. ఇప్పుడు పాకిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అప్డేట్స్ మిస్ కాకుండా ఉండేందుకు ఫోన్లలో ఈ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచించారు.
ఆండ్రాయిడ్, ఐఫోన్లలో ఈ వెసులుబాటు ఉంది. మీ ఫోన్లలో అలర్ట్స్ డిజేబుల్ చేసి ఉంటే ఎనేబుల్ చేసుకోవాలి. మరి అలర్ట్ నోటిఫికేషన్లను ఎలా ఎనేబుల్ చేయాలో తెలుసుకుందాం.. మీరు ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే ఫోన్లో సెట్టింగ్స్‌ను ఓపెన్ చేయాలి. సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ ఆప్షన్‌ను టాప్ (TAP) చేయాలి. లేకపోతే ‘ఎమర్జెన్సీ అలర్ట్స్’ అని సెర్చ్బార్లో సెర్చ్ చేయవచ్చు.
ఈ విధంగా వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్‌ను ఎంపిక చేసుకోవాలి.
మీరు ఐఫోన్ యూజర్స్ అయితే.. సెట్టింగ్స్ యాప్‌ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత నోటిఫికేషన్స్‌కు వెళ్లాలి. ఆపై గవర్నమెంట్ అలర్ట్స్ అని ఉంటుంది. అక్కడ కీలక అలర్ట్‌లు వచ్చేందుకు ఆప్షన్‌ను ఆన్ చేయాలి. ఆ తర్వాత నుంచి ఒక్కో ఎమర్జెన్సీ సమయంలో ఒక్కోలా అలర్ట్స్ వస్తుంటాయి.