న్యూఢిల్లీ : బిలియనీర్ ఎలాన్ మస్క్ తన 11 మంది పిల్లలు, వారి తల్లు లను ఒక చోట చేర్చేందుకు 35 మిలియన్ల(దాదాపు రూ. 294 కోట్లు)తో విశాలమైన భవనం కొనుగోలు చేశారు. టెక్సాస్లోని ఆస్టిన్లో 14,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవనం, దాని పక్కనే ఆరు బెడ్రూంలు కలిగిన మరో ఇంటిని మస్క్ కొనుగోలు చేసినట్టు ‘న్యూయార్క్ టైమ్స్’ తన కథనంలో పేర్కొంది. ఈ ఇంటి వల్ల పిల్లలు ఒకరికొకరు తోడుగా ఉంటారని, వారితో గడిపేందుకు తనకు సమయం దొరుకుతుందని మస్క్ భావిస్తున్నారట.