ఢిల్లీ రికార్డు.. అత్యధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు అకస్మాత్తుగా పెరిగాయి. ఢిల్లీ ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎన్జీ, హైబ్రిడ్ ఇంధన వాహనాల కన్నా ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖలో గత జూలై నుంచి సెప్టెంబర్ మధ్య ఏడు శాతం మేర ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. ఇక సీఎన్జీ వాహనాలు కేవలం ఆరు శాతం మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. ఈ సమయంలో 1.5 లక్షల వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. దాంట్లో 7869 ఎలక్ట్రిక్ వాహనాలు, 6857 సీఎన్జీ వాహనాలు, సీఎన్జీ-పెట్రోల్‌తో నడిచే 7257 వాహనాలు ఉన్నట్లు చెప్పారు. కేవలం పెట్రోల్, డీజిల్‌పై నడిచే వాహనాలు 93,091 రిజిస్టర్ అయినట్లు అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ వెహికిల్ విధానం క్రమం పుంజుకుంటోందని, ఆ వాహనాల కోనుగోలు పెరిగిందని, ఢిల్లీని ఎలక్ట్రిక్ వెహికల్ క్యాపిటల్‌గా మార్చాలన్న తమ లక్ష్యం నెరవేరనున్నదని రశాణాశాఖ మంత్రి కైలాశ్ గహ్లోత్ తెలిపారు. ఎలక్ట్రిక్ రిక్షాలు, టూ వీలర్లతో పాటు ఎలక్ట్రిక్ కార్లు, బస్సుల కొనుగోళ్లు కూడా పెరిగినట్లు రవాణశాఖ అధికారులు అంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

