న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు. వాటిపై ప్రజలకు కొన్ని సూచనలు చేశారు.
“మరోసారి ఎన్నికలు, రాజకీయాల ప్రస్తావన వస్తే, ఖాళీగా కూర్చున్న బూటకపు పాత్రికేయులు, పెద్ద నోరు పెట్టుకుని మాట్లాడే రాజకీయ నేతలు, సామాజిక మాధ్యమాల నిపుణులమని చెప్పుకునే స్వయం ప్రకటిత విశ్లేషకుల పనికిమాలిన చర్చలు, విశ్లేషణల జోలికి వెళ్లి, మీ విలువైన సమయాన్ని వృథా చేసుకోకండి” అని శనివారం ట్వీట్ చేశారు.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 300కుపైగా స్థానాలు వస్తాయని ప్రశాంత్ మొదటి నుంచి చెప్తున్న సంగతి తెలిసిందే.