EC | న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల పోలింగ్ శాతాల వెల్లడిలో ఈసీ జాప్యంపై జర్నలిస్టు సంఘాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. గతంలో ఇలా ఎన్నడూ జరుగలేదని, దీని వల్ల ఎన్నికల పారదర్శకతపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశాయి.
ఈ మేరకు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ప్రెస్ అసోసియేషన్, ఇండియన్ ఉమెన్ ప్రెస్ కార్ప్, ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్సు శనివారం ఈసీకి లేఖ రాశాయి. మూడు దశల ఎన్నికల పూర్తయినప్పటికీ, ఈసీ ఒక్క మీడియా సమావేశం కూడా నిర్వహించకపోవడాన్ని ప్రశ్నించాయి. గతంలో మాదిరిగా ప్రతి దశ పోలింగ్ తర్వాత మీడియా సమావేశం నిర్వహించాలని, ఓటింగ్ తర్వాతి రోజున తుది పోలింగ్ శాతా న్ని విడుదల చేయాలని డిమాండ్ చేశాయి.