EC | జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ఖాళీ ఏర్పడిన దేశ అత్యున్నత స్థానం ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక (Vice Presidential election) ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆర్వో, అసిస్టెంట్ ఆర్వోను తాజాగా నియమించింది.
రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖతో సంప్రదించి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అంగీకారంతో రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీని రిటర్నింగ్ అధికారిగా నియమించింది. ఇక రాజ్యసభ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ గరిమా జైన్, సెక్రటేరియట్ డైరెక్టర్ విజయ్ కుమార్లను సహాయ రిటర్నింగ్ అధికారులుగా నియమించింది.
Election Commission of India appoints Returning Officers and Assistant ROs for the Vice Presidential election pic.twitter.com/PzMOCBpnbB
— ANI (@ANI) July 25, 2025
ఉప రాష్ట్రపతి (Vice President) జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhar) తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరో రెండేండ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన కుర్చీని ఖాళీచేశారు. ఆరోగ్య కారణాలను పేర్కొంటూ రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. దీంతో ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఆయన రాజీనామాతో దేశంలో అత్యున్నత స్థానం ఖాళీ అయ్యింది. ఈ నేపథ్యంలో తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే (Next Vice President) అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది. కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ఆగస్టు చివరి నాటికి పూర్తవుతుందని సమాచారం.
ఉపరాష్ట్రపతి రేసులో..
తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే (Next Vice President) అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది. అధికార పార్టీ పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అందులో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar), కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు జనతాదళ్ (యునైటెడ్) ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ (Harivansh Narayan Singh) కూడా ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నారు. ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా లేదంటే ఢిల్లీ ఎల్జీ సక్సేనాలో ఎవరికో ఒకరికి అవకాశం ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో తీవ్రంగా చర్చనడుస్తోంది. అయితే, ఇప్పుడు అనూహ్యంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేరుకూడా రేసులోకి వచ్చింది. దీంతో ఈ పదవి చేపట్టబోయేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read..
PM Modi | బ్రిటన్ రాజుకు మొక్కను బహూకరించిన ప్రధాని మోదీ
Lok Sabha | పార్లమెంట్ సమావేశాలను కుదిపేస్తున్న ఓటరు జాబితా సవరణ.. లోక్సభ మధ్యాహ్నానికి వాయిదా