Kiren Rijiju | రాజ్యాంగ సంస్థలను బెదిరించడం రాహుల్ గాంధీ ఇదే తొలిసారని కాదని.. ప్రజాస్వామ్యాన్ని బలహీన పరిచే కుట్రగా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. రాహుల్ ఆలోచనా ప్రమాదకరమని.. ప్రతిపక్షాలు బాగా ప్రణాళికాబద్ధంగా, దుర్మార్గంగా ప్రణాళిక వేసుకుని రాజ్యాంగ సంస్థల ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు. రాహుల్ గాంధీ శైలి కారణంగా ప్రతిపక్షాల్లోనూ అసమ్మతి పెరుగుతోందని రిజిజు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా అంతర్గతంగా రాహుల్ గాంధీని వ్యతిరేకించడం ప్రారంభించారని.. ఆయన నీచ రాజకీయాలు చేస్తున్నారని, దేశ ప్రతిష్టను నాశనం చేయాలని కోరుకుంటున్నారని ప్రజలు అంటున్నారన్నారు. ప్రతిపక్షాలు పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నాయని.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపించారు.
చర్చ ప్రారంభమైన వెంటనే, ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి వచ్చి పార్లమెంట్ కార్యకలాపాలను కొనసాగనివ్వడం లేదని అన్నారు. రాహుల్ గాంధీ పదే పదే భారత వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నారని, ఇది సరికాదన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ప్రతిష్ట గురించి ఎవరూ అవమానకరమైన వ్యాఖ్యలు చేయలేదన్నారు. రాహుల్ గాంధీ చిన్నపిల్లవాడు ఏం కాదని.. ప్రతిపక్ష నాయకుడిగా దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడం, పార్లమెంట్‌కు అంతరాయం కలిగించడం సరైంది కాదన్నారు. పార్లమెంటు పనిచేయకపోవడం వల్ల ప్రతిపక్షాలు ఎక్కువగా నష్టపోతున్నాయని, ఎందుకంటే వారి సమస్యలను సభలో లేవనెత్తలేరన్నారు. నిబంధనల ప్రకారం లేవనెత్తగల అంశాలను ప్రతిపక్షం చర్చించదని విమర్శించారు. సభ్యుల డిమాండ్ మేరకు సీఐఎస్‌ఎఫ్‌ని మోహరించారని.. పార్లమెంటులో భద్రత పెంపు గురించి లేవనెత్తిన ప్రశ్నల మధ్య, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పరిస్థితిని స్పష్టం చేశారు.
ఎంపీల భద్రతా సంబంధిత డిమాండ్ల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. పార్లమెంటులో భద్రత పెంచాలని ఎంపీలు స్వయంగా డిమాండ్ చేశారని, అందుకే CISFను మోహరించామని రిజిజు అన్నారు. పార్లమెంటు లోపల చాలాసార్లు, కొంతమంది సభ్యులు ట్రెజరీ బెంచ్ టేబుల్‌పైకి ఎక్కుతారని.. వెల్‌లోకి వచ్చి దూకుడుగా ప్రవర్తిస్తారన్నారు. అలాంటి చర్యలను నివారించడానికి భద్రతా దళాలను మోహరించారన్నారు. ఏ ఎంపీ మాట్లాడకుండా ఆపబోమన్నారు. ఎంపీ దుర్మార్గపు కార్యకలాపాలకు పాల్పడితే తప్ప, భద్రతా దళాలు ఎలాంటి చర్యలు తీసుకోవన్నారు. ఎంపీలు దూకుడుగా వ్యవహరిస్తే.. వారిని ఆపేందుకు ఏర్పాట్లు చేస్తారన్నారు. సర్ (SIR)పై పార్లమెంటులో చర్చకు ప్రతిపక్షం డిమాండ్ చేయడంపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు, నిబంధనల ప్రకారం ఏదైనా అంశంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే, ఆయా అంశాలను చర్చించలేమని స్పష్టం చేశారు. ఎందుకంటే ఇది రాజ్యాంగ సంస్థ ఆమోదించిన ప్రక్రియ అని.. నిబంధనల ప్రకారం ఏదైనా అంశంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ సర్‌పై చర్చించలేమని.. ఇదేం తొలిసారిగా జరుగడం లేదన్నారు.