Rahul Gandhi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Pm Modi) పై అనుచిత వ్యాఖ్యలు (panauti remark) చేసిన కారణంగా కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi )కి ఎన్నికల సంఘం (Election Commission) గురువారం నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం 6 గంటల లోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. కళ్ల ముందే కప్పు చేజారడంతో భారత జట్టు సహా అభిమానులు, పలువురు ప్రముఖులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ మ్యాచ్‌కు ప్రధాన మంత్రి మోదీ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టు ఓటమిపై రాహుల్ స్పందించారు. మంగళవారం రాజస్థాన్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ ప్రపంచకప్ చేజారడానికి కారణం మోదీనే అంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘మన అబ్బాయిలు (టీమ్ఇండియా ఆటగాళ్లను ఉద్దేశిస్తూ) దాదాపు ప్రపంచకప్ గెలుచుకున్నారు. కానీ చెడు శకునం ప్రవేశం వారిని ఓడిపోయేలా చేసింది’ అంటూ మోదీని ఉద్దేశిస్తూ పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు రాహుల్‌కు గురువారం నోటీసులు జారీ చేసింది. శుక్రవారం సాయంత్రం 6 గంటల లోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
Also Read..
Sabarimala temple | శబరిమల అయ్యప్ప ఆలయం వద్ద పాముకాటుకు గురైన చిన్నారి
Minister Ktr | కాంగ్రెస్‌కు ఇక్కడ బేస్ లేదు.. రెండో స్థానం కోసమే పాకులాట : మంత్రి కేటీఆర్
Minister KTR | కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ ఢమాల్ : మంత్రి కేటీఆర్