న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ‘సక్రమంగా పని చేయలేని’, ‘విఫల’ వ్యవస్థ అని రాజ్యసభ సభ్యుడు, సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ పేర్కొన్నారు. ఈసీ మీద అత్యధికులకు నమ్మకం లేదన్నారు. అది తన రాజ్యాంగపరమైన బాధ్యతలకు అనుగుణంగా పని చేయకపోవడమే దీనికి కారణమని వివరించారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకం క్షీణిస్తున్నదని సిబల్ ఆరోపించారు. న్యాయమూర్తుల నియామకాలతోపాటు ప్రస్తుత వ్యవస్థలు పని చేయడం లేదని, చాలా కేసుల్లో జిల్లా, సెషన్స్ కోర్టులు బెయిలు ఇవ్వడం లేదన్నారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ వివాదాస్పద ప్రసంగం గురించి ప్రస్తావించారు.