Elderly Man | సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మనకు తెలిసిపోతోంది. ఎన్నో వింతలు, వినోదాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. అదే సమయంలో కొన్ని స్ఫూర్తినిచ్చే వీడియోలు కూడా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ వృద్ధుడు (Elderly Man) వర్షంలో కూడా రైల్వే ప్లాట్‌ఫామ్ (Railway Platform)పై యోగా (Yoga)సనాలు చేస్తున్న వీడియోని ఇండియన్ రైల్వేస్ రెడ్డిట్ (Reddit)లో పోస్టు చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.
ఓ వృద్ధుడు రద్దీగా ఉండే రైల్వే ప్లాట్‌ఫామ్‌పై యోగాసనాలు చేశాడు. అనేక భంగిమలను ప్రదర్శిస్తూ అక్కడున్న వారిని ఆకట్టుకున్నాడు. వర్షం కురుస్తున్నప్పటికీ ఓ బెంచ్‌పై యోగాసనాలు వేస్తూ కనిపించాడు. తలకిందలుగా యోగా చేస్తూ అందరి చూపును ఆకర్షించాడు. ఇందుకు సంబంధించిన దృష్యాలను రైలు కోసం వేచి ఉన్న ప్రయాణికులు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. వర్షంలోనూ యోగాను ఎంజాయ్ చేస్తున్న ఆ వృద్ధుడిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ మేరకు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Waiting for the train and saw an old Man doing Yoga on the platform while it was raining.
byu/PeepalGhost inindianrailways
Also Read..
Turbulence | విమానం గాల్లో ఉండగా భారీ కుదుపులు.. 25 మంది ప్రయాణికులకు గాయాలు
Air Traffic Glitch | ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య.. రద్దైన వందలాది విమానాలు