Eknath Shinde : మహారాష్ట్రలోని సింధ్‌దుర్గ్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటన పెను దుమారం రేపింది. ఈ ఘటనను పార్టీలకు అతీతంగా పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు. శివాజీ విగ్రహం కూలిన ఘటన దురదృష్టకరమని, ఈ ఘటనపై తాను మహారాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబుతున్నానని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొనడం తెలిసిందే.
కాగా, ఈ ఘటనకు సంబంధించి ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ శిల్పి జయదీప్ ఆప్టేను అరెస్ట్ చేశారు. ఆప్టే అరెస్ట్‌పై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. తాను ఇదే విషయం గతంలో చెప్పానని, చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమేనని, ఆప్టే అరెస్ట్ తప్పదని అన్నానని షిండే గుర్తు చేశారు. జయదీప్ ఆప్టే పాత్రపై ఇప్పుడు విచారణ జరుగుతుందని అన్నారు.
ఛత్రపతి శివాజీ మహరాజ్ తమ దేవుడని, జరిగిన ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. శివాజీ విగ్రహం కూలిన ఘటనను రాజకీయం చేయడం దురదృష్టకరమని ఏక్నాథ్ షిండే అన్నారు. కాగా, శివాజీ విగ్రహం కూలిన ఘటనపై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె కీలక వ్యాఖ్యలు చేశారు. శివాజీ విగ్రహం కూలిన ఘటనలో కేవలం శిల్పి మాత్రమే కాదని పలువురు ఇతరులను కూడా బాధ్యుల్ని చేయాలని అన్నారు.
Read More :
Gold | త్వరలోనే అందుబాటులోకి 9 క్యారెట్ల గోల్డ్..! అసలేంటీ బంగారం కథ..!