Gold | త్వరలోనే అందుబాటులోకి 9 క్యారెట్ల గోల్డ్..! అసలేంటీ బంగారం కథ..!
24-క్యారెట్ల మేలిమి బంగారం గురించి అందరికీ తెలిసిందే. ఆభరణాల తయారీలో 22-క్యారెట్లు, 18-క్యారెట్ల బంగారాన్ని వినియోగిస్తారన్న సంగతి కూడా విదితమే. అయితే, కేంద్రం త్వరలో 9-క్యారెట్ల బంగారాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం.
- గొలుసు దొంగతనాలు పెరుగుతున్న క్రమంలో త్వరలో తీసుకొచ్చే యోచనలో కేంద్రం
- 10 గ్రాముల ధర రూ. 25 వేల నుంచి రూ. 30 వేలు
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : 24-క్యారెట్ల మేలిమి బంగారం గురించి అందరికీ తెలిసిందే. ఆభరణాల తయారీలో 22-క్యారెట్లు, 18-క్యారెట్ల బంగారాన్ని వినియోగిస్తారన్న సంగతి కూడా విదితమే. అయితే, కేంద్రం త్వరలో 9-క్యారెట్ల బంగారాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు బంగారు నగల వ్యాపారులతో కేంద్రప్రభుత్వం ప్రతినిధులు మంగళవారం భేటీ అయినట్టు జాతీయ పత్రిక ‘మింట్’ ఓ కథనంలో వెల్లడించింది.
ఎందుకు తీసుకొస్తున్నారు?
24-క్యారెట్ల తులం బంగారం రూ.73 వేలకు పైబడి పలుకుతున్నది. 22-క్యారెట్ల తులం బంగారం ధర కూడా రూ.68 వేల పైమాటే. దీంతో దొంగలు తమ చేతివాటం చూపుతున్నారు. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం.. 2021తో పోలిస్తే, 2022లో దేశంలో గొలుసు దొంగతనాలు 32.54 శాతం మేర పెరిగాయి. దీంతో చవక బంగారంపై వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నట్టు వ్యాపారులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం 9-క్యారెట్ల బంగారాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం.
ధర ఎంత ఉండొచ్చు?
9-క్యారెట్ల తులం బంగారం ధర రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 24-క్యారెట్లు, 22-క్యారెట్ల బంగారం నాణ్యతను ధ్రువీకరించేందుకు ఉద్దేశించిన హాల్‌మార్క్, బీఎస్ఐ ముద్రలు ఈ బంగారంపై కూడా ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్ 35 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 45.5 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకొన్నది. స్విట్జర్లాండ్, యూఏఈ, పెరూ, ఘనా దేశాల నుంచి భారత్ ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకొంటున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

